ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ పై అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ఫిర్యాదు నమోదైంది. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధినేని యామినిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యామిని వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఇష్టానుసారం నోరుపారేసుకొంటున్నారని ఆరోపించారు. యామిని నోరు అదుపులో పెట్టుకోవలంటూ హెచ్చరిస్తున్నారు.
