ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఏపీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్ కర్నూలులో మాట్లాడారు. పార్లమెంట్‌లో చంద్రబాబు బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ఏపీ ప్రజలు టీడీపీపై అవిశ్వాసం పెట్టి వైసీపీని గెలిపించారని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని సునీల్ పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని ఆరోపించారు. భవిష్యత్తులో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కాలేరని ఆయన స్పష్టం చేశారు.
