విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల సమావేశంలో జల వినియోగం దిశగా తొలి అడుగులు పడ్డాయి.
