గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అత్యంత సన్నిహితుడు. అయితే సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని ఓ కోరిక కోరాడు.. ఆ కోరిక ఏంటంటే.. పక్కా టీడీపీ సానుభూతిపరులైన ఈడీ అసిస్టెంటు డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ, జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్ ఏళ్లకేళ్లుగా తిష్టవేశారని. చంద్రబాబు చెప్పినట్టే నడుచుకునే వీరిద్దరూ తమను అకారణంగా సతాయిస్తున్నారనీ, తమ ఆస్తుల స్వాధీనం విషయంలోనూ అడ్డదిడ్డంగా కక్షసాధింపు నిర్ణయాలు తీసుకుంటున్నారనీ కేంద్రానికి ఫిర్యాదురూపంలో ఓ విజ్ఞప్తి చేశాడు జగన్.ఈ విజ్ఞప్తి చేసిన కొన్నాళ్లకు కేంద్రం స్పందించింది. సదరు బొల్లినేని గాంధీని ఈడీ నుంచి జీఎస్టీ విభాగానికి బదిలీ చేసింది. అక్కడితో ఆగలేదు. ఆయనపై ఓ కన్నేసి ఉంచింది. దాని ఫలితంగానే ఇప్పుడు అధిక ఆదాయం కలిగి ఉన్నారన్న కారణంతోనే ఈకేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఆయనపై సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. బొల్లినేనికు సంబంధించిన ఆఫీసుల్లోఆయన ఇళ్లపై సోదాలు జరిగాయి. ఒకప్పుడు జగన్ కేసు దర్యాప్తు సందర్బంగా గాంధీ తీసుకున్న నిర్ణయాలతో జగన్, జగన్ భార్య భారతిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. దీని పై జగన్ నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేయటంతో గాంధీని ఈడీ నుండి జీఎస్టీకి బదిలీ చేశారు. అప్పటి నుంచి కేంద్రం ఓ కన్నేసి ఉంచింది.నేడు రెడ్ హ్యండెడ్ గా పట్టుకోని జైలుకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో.. చంద్రబాబు నెట్ వర్క్ లో ఓ కీలక అధికారికి మోడీ చెక్ చెప్పారన్నమాట.
