అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై నిర్దిష్ట చట్టంలోని సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా టీడీపీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.
అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపిసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 21, 2019