గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు… ఎమ్మెల్యే రజిని గౌరవానికి భంగం కలిగేలా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోస్టింగ్‌లు పెడుతున్న పి.కోటేశ్వరరావు, బాలాజీసింగ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ సూర్యనారాయణ తెలిపారు.
