ఏపీలో సీఎం జగన్ 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే మూడవ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ నిరుపేద ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అంధత్వంతో బాధపడడం చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కంటి సమస్యలతో బాధపడకుండా…కొత్తగా వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని అక్టోబర్ నుంచి అమలు చేస్తామని…. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన కంటివెలుగు వర్క్‌షాపును ప్రారంభించిన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
