గత ఐదేళ్లలో అమరావతిలో సింగపూర్ స్థాయి రాజధాని అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన బాబు బండారం మరోసారి బయటపడింది. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతిలో కేవలం రెండే రెండు తాత్కాలిక భవనాలు కట్టించాడు. అవి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్ట్. అప్పట్లో చిన్నపాటి వర్షానికి సచివాలయం కురిసింది. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వైసీపీ నేతలే జగన్ ఛాంబర్‌లోని ఏసీ పైపులు కోయించి..వర్షపు నీరు వచ్చేలా చేసి…ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటూ…టీడీపీ ఎదురుదాడికి దిగింది. అసలు తాత్కాలిక సచివాలయం అంటే..ఏదో ఏ 5 కోట్లో, పది కోట్లో ఖర్చుపెట్టలేదు.. దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టించి కట్టించిన సచివాలయ భవనం చిన్న వర్షానికే కురవడం చూస్తే కాంట్రాక్టర్లు ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించారో, చంద్రబాబు ఏ మేరకు కమీషన్లకు కక్కుర్తి పడ్డారో అర్థమవుతుంది.
తాజాగా అమరావతిలో మరోసారి బాబు బండారం బయటపడింది. ఈ సారి హైకోర్ట్ వంతు…చంద్రబాబు హయాంలో నిర్మితమైన ఈ హైకోర్ట్ భవనం తాజాగా కురిసిన చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దయింది. హైకోర్ట్ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పలు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో భవనంలోపలకు భారీగా వర్షం నీరు చేరింది. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా వర్షపునీటితో నిండిపోయింది. దాదాపు 150 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ తాత్కాలిక హైకోర్ట్ భవనం…చిన్న వర్షానికే మునిగిపోవడంతో న్యాయవాదులు నోరెళ్లబెడుతున్నారు. ఏకంగా లోపల గదుల్లోని గోడల నుంచి నీరు కారుతుందంటే..హైకోర్ట్ భవన నిర్మాణంలో కాంట్రాక్టర్లు, టీడీపీ పెద్దలు ఎంత చేతివాటం ప్రదర్శించారో తెలుస్తోంది. టీడీపీ పెద్దలకు కమీషన్లు ఏ స్థాయిలో చెల్లిస్తే..ఇలా హైకోర్ట్ భవనం చిన్నపాటి వర్షానికే మునిగిపోయిందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రూ. 1200 కోట్లు పెట్టి చంద్రబాబు కట్టించిన రెండు తాత్కాలిక భవనాలు…ఇలా చిన్నవర్షానికే కురవడం చూస్తుంటే..బాబుగారి పనితనం ఏంటో అర్థమవుతుంది. ఈ పాటి దానికి సింగపూర్ స్థాయి రాజధాని, మరో టోక్యో, మరో ఇఫ్లాంబుల్ అంటూ బాబుగారు బిల్డప్‌లు ఇవ్వడం..అంతా మన ఖర్మ కాకపోతే.