శరన్నవరాత్రుల్లో సందర్భంగా నేడు ఆదివారం అనగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు కనకదుర్గమ్మ అమ్మ వారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఆమెను దుర్గముడనే రాక్షశుడిని సంహరించడంతో ఆమెను మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో, ఎర్రటి పువ్వులతో కొలిస్తే శత్రువులు నుండి భాద తప్పుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, కదంబం,బెల్లం, పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.
