రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గోదావరి జిల్లాల్లో సందడి చేసారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహానికి వీరు హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ వివాహానికి హాజరు కాలేకపోయారు. ప్రభుత్వం తరఫున నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గోదావరి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు గాయకులతో ముచ్చటించారు. రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన ఆర్థిక మంత్రికి గోదావరి జిల్లాల నాయకులు చక్కని ఆతిథ్యం ఇచ్చారు.
