ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఇదొక గొప్పం కార్యక్రమం అనే చెప్పాలి. జగన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ అనగా రేపు ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమమే ‘వైయస్సార్ కంటి వెలుగు’. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. రేపు ఉదయం 11:30 సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యి ‘వైయస్సార్ కంటి వెలుగు’ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ఆరు విడతలుగా మూడేళ్ళపాటు అమలవుతుంది. వరల్డ్ సైట్ డే సందర్భంగా వైయస్సార్ కంటి వెలుగు కింద రాష్ట్ర ప్రజలకి ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు లభిస్తాయి.
