దివంగత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోడెల శివరామ్‌కు సంబంధించి మరో కక్కుర్తి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే కే ట్యాక్స్ కేసులు, కేబుల్ టీవీ స్కామ్‌లు, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో ఇరుక్కున్న కోడెల శివరామ్ ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు. రూల్స్‌ను అతిక్రమించి, హెల్‌సేల్‌గా వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మేసినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతే కాదు దాదాపు 40 వేల టూవీలర్ బైక్‌లకు పన్నులు ఎగవేసిన వ్యవహారం బయటపడింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా కోడెల శివరామ్‌కు కోటి రూపాయల జరిమానా విధించారు. ఆర్టీఏ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో తన తప్పును ఒప్పుకున్న శివరామ్ తనకు రెండు రోజులు సమయాన్ని ఇస్తే ఆ మొత్తం చెల్లిస్తానని కోర్ట్‌కు తెలియజేశారు. కోడెల శివరామ్ గౌతం హోండా షోరూంను నిర్వహిస్తుంటారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) లేకుండానే బైక్‌లు అమ్మెవారు. అప్పుడు స్పీకర్ కొడుకు కావడంతో నిబంధనలకు వ్యతిరేకంగా బైక్‌లు అమ్ముతున్నా..ఇదేంటని ఆర్డీఏ అధికారులు ప్రశ్నించలేకపోయారు. అయితే ప్రభుత్వం మారడంతో కోడెల శివరామ్‌పై ఆర్డీఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు శివరామ్ టీఆర్ లేకుండానే 1025 బైకుల్ని అమ్మడమే కాకుండా 40 వేల బైక్‌లకు పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం శివరామ్‌కు కోటి రూపాయలు జరిమానా విధించారు. ఈ జరిమానాపై కోర్ట్‌కు వెళ్లిన శివరామ్ తన తప్పు ఒప్పుకుని రెండు రోజుల గడువు ఇస్తే తీరుస్తానని మొరపెట్టుకున్నాడు. ఇలా టీఆర్ లేకుండా బైక్‌లు అమ్మడమే కాకుండా..ఏకంగా 40 వేల బైక్‌లకు ట్యాక్స్‌లు ఎగ్గొట్టిన కోడెల శివరామ్ కక్కుర్తి పనులకు సత్తెనపల్లి, నరసరావుపేట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే వరుసగా కేసుల్లో ఇరుక్కున కోడెల శివరామ్..ఇప్పుడు బైక్‌లకు ట్యాక్స్‌లు ఎగ్గొట్టిన వ్యవహారంతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మున్ముందు కోడెల తనయుడి అక్రమాలు మరెన్ని బయటపడతాయో చూడాలి.