పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు కాకముందే సీఎం జగన్ ప్రజాహితపాలనతో ముందుకువెళుతుంటే.. చంద్రబాబు మాత్రం రాజధాని డ్రామా, పల్నాడు డ్రామా, కోడెల డ్రామా, ఇలా..వరుస డ్రామాలతో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందంటూ ఎల్లోమీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. రాజధాని వెనక్కిపోయిందని, పెట్టుబడులు రావడం లేదని బాబుగారు ఎంతగా అరిచిగీపెట్టినా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. అయినా బాబుగారు మాత్రం ప్రజలు నన్ను కోరుకుంటున్నారనే భ్రమలో బతుకుతున్నాడనిపిస్తోంది.. ఆ మధ్య తన నివాసంలో తన పార్టీ నేతలతో డబ్బులిచ్చి మరీ.. కొన్ని వర్గాల ప్రజలను తన ఇంటికి పిలిపించుకుని, కాసేపు వాళ్లతో ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టించి తనకు తాను ఓదార్పు పొందాడు.
మరోపక్క సీఎం జగన్ పాలన అన్నివర్గాలను ఆకట్టుకునేలా సాగుతుండడంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడింది. ఇటీవల గ్రామసచివాలయ, గ్రామవాలంటీర్ల వ్యవస్థ ఏర్పరిచి ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో యువతలో సీఎం జగన్ పట్ల ఆదరణ పెరిగింది. ఇక రైతు భరోసాతో రైతులు సంతోషంగా ఉంటే..ఆటో డ్రైవర్లు, ఆశావర్కర్లు వంటి, ఇలా..చిరుద్యోగులు, కార్మికులు సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. కళ్ల ముందు ఇన్ని వాస్తవాలు కనపడుతున్నా..బాబుగారు మాత్రం ఇంకా భ్రమలోనే బతుకుతున్నాడు. ఒక పక్క సుజనా, సీఎం రమేష్‌లు వంటి బినామీలతో పార్టీ ముఖ్యనేతలను బీజేపీలోకి పంపిస్తూ…కేసుల భయంతో మోదీతో మళ్లీ పొత్తు కోసం వెంపర్లాడుతూ.. పార్టీని బలోపేతం చేస్తామంటూ, అధికారంలోకి వచ్చేస్తామంటూ చెప్పడం జనాలను మోసం చేయడమేనని టీడీపీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయినా ఐదేళ్ల నీ అవినీతి, అరాచక పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్‌కు ఏకంగా 151 సీట్లు కట్టబెట్టి నిన్ను చిత్తుగా ఓడించారు. రైతులు, ఉద్యోగులు, మహిళలు, అవ్వాతాతలు, కార్మికులు, విద్యార్థులు, ఇలా…అన్ని వర్గాలను పీడించుకుతిన్నావు. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశావు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థుల ఉసురు కొట్టుకున్నావు. మహిళల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడావు, ఇసుక, మట్టి, ఎర్రచందనం, సున్నపురాయి..ఇలా సహజవనరులన్నింటిని దోచుకుని వేలకోట్లు నువ్వు, నీ పార్టీనేతలు వేల కోట్లు దోచుకున్నారు..నీ అరాచకపాలనను ప్రజలు ఇప్పుడు కాదు కదా..మరో 20 ఏళ్లవరకు మర్చిపోయే పరిస్థితిలేదు..నీ భయానక పాలన ఇంకా మర్చిపోలేదయ్యా..మళ్లీ నువ్వు రావద్దు బాబయ్య అని ప్రజలు మొక్కుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజలు నిన్ను కోరుకుంటున్నారంటూ ..కామెడీ చేయకండి బాబుగారు…కాస్త భ్రమలోంచి బయటకు వచ్చి..వాస్తవంలోకి రండి…బాధ్యతాయుతంగా మెలగండి..నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి..అప్పుడే ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది. కానీ ఇలా అఖండ మెజారిటీతో వైసీపీకి అధికారం కట్టబెట్టిన ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడకండి అంటూ వైసీపీ నేతలు బాబుగారికి హితవు పలుకుతున్నారు. అయినా బాబుగారు మారుతాడా..తానే మళ్లీ సీఎం అనే భ్రమలో ఈ నాలుగున్నరేళ్లు బతికేస్తూనే ఉంటాడు. ప్రజల మీద అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటాడు..ఇలా కామెడీ డైలాగులు కొడుతూనే ఉంటాడు..ఏపీ ప్రజలు ఇంకో నాలుగున్నరేళ్లు ఆయన కామెడీలను చూస్తూ భరించాల్సిందే..