ఏపీలో కేంద్ర ఉపాధి హామీ పనుల్లో రూ.2500కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను వైసీపీ ప్రభుత్వం వాడుకోవడం చట్ట విరుద్ధం. ఈ నిధులను కేవలం పులివెందుల,పుంగనూరు నియోజకవర్గాలకు వాడుకున్నారు అని ఆయన అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రంలో విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ పాలనలో జరిగిన పలు అవినీతి అక్రమాలను త్వరలోనే వెలుగులోకి తీసుకోస్తామని మీడియాకు తెలిపిన సంగతి విదితమే.
