టాలీవుడ్లో లేటేస్ట్ సెన్సేషన్ జార్జిరెడ్డి మూవీ..80 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీయస్ పార్టీని స్థాపించి, ప్రజా ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన జార్జిరెడ్డి చిత్రాన్ని యూత్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే జార్జిరెడ్డిలోని ఆవేశాన్ని, ఉద్యమ పంథాను ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జార్జిరెడ్డిని పవన్ కల్యాణ్‌ను పోల్చడానికి ప్రముఖ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి భర్వదాజ తప్పుపట్టారు. అసలు జార్జిరెడ్డి ఎక్కడ..పవన్ కల్యాణ్ ఎక్కడా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. అసలు పవన్‌తో పోల్చడమంటే నిజంగా జార్జిరెడ్డిని అవమానించినట్లే అని ఆయన అన్నారు. జార్జిరెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేవారు..కాని పవన్ మాత్రం తాను నమ్మిందే మాట్లాడుతారు..జార్జిరెడ్డి ప్రజా ఉద్యమాలు నడిపారు. ప్రజల గొంతుకై నిలిచారు.కాని పవన్ మాత్రం చెప్పింది ఒక్కటైనా చేశారా.. పార్టనర్‌కు ఏదైనా ఇబ్బంది అయితే మూడు నెలలకు ఒకసారి రావడం, లేకుంటే ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం తప్ప ఏదైనా సాధించారా అని తమ్మారెడ్డి నిలదీశారు. పవన్ కల్యాణ్ తన సినిమాల్లోనే కాదు బయట కూడా తనకు తాను చేగువేరాతో పోల్చుకుంటారని..గడ్డం పెంచుకుంటే అందరూ చేగువేరా అయిపోరని…పవన్ చేగువేరాకు ఫ్యాన్ మాత్రమే.కాని చేగువేరా బాటలో సామ్రాజ్యవాదంపై పోరాడిన ఉద్యమ యోధుడు జార్జిరెడ్డి అని తమ్మారెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆశించానని, కాని రెండుసార్లు పవన్ చంద్రబాబుకు డమ్మీగా పని చేశారు.గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పిన పవన్ కొన్ని స్థానాల్లో మాత్రమే ఎందుకు పోటీ చేశారు..అది కూడా నారాలోకేష్ వంటి టీడీపీ కీలక నేతల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీ చేయించిన పవన్ చంద్రబాబుకు డమ్మీ మాత్రమే అని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను పవన్ మళ్లీ ఇదే చేయరన్న..గ్యారంటీ లేదని..ఒక్కసీటుమాత్రమే గెలిచిన జనసేన భవిష్యత్తులో ఏనాటికి రాజకీయ ప్రత్యామ్నాయం కాలేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఒక డమ్మీ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసని, ఆఖరికి తాను బాబుకు డమ్మీ అన్న విషయం పవన్‌కు కూడా తెలుసని తమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తంగా జార్జిరెడ్డి పవన్‌కల్యాణ్‌తో పోల్చడంపై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
