అమరావతిలో చంద్రబాబు చేసిన పర్యటన వివాదాస్సదంగా మారింది. కేవలం జగన్ సర్కార్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే అమరావతిలో పర్యటించిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఇప్పుడు ఓ కేసులో అడ్డంగా బుక్ కానున్నారు. రాజధానిలో బాబు పర్యటిస్తున్న సమయంలో దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబు కాన్వాయ్‌పై ఓ రైతు చెప్పు విసరగా, మరొక రైతు రాళ్లు విసిరాడు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాబు పర్యటనలో జరిగిన గందరగోళాన్ని మొత్తం లోకేష్ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నేతలు డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించినట్లు సమాచారం. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కరకట్టమీద ఉన్న తన ఇంటి చుట్టూ వైసీపీ నేతలు డ్రోన్ కెమెరాలు తిప్పారని, తనకు ప్రాణభద్రత లేదని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. అయితే అప్పుడు ఆ పని చేయించింది వైసీపీ నేతలు కాదని వైసీపీ ఆ డ్రోన్ కెమెరాలు ఎగురవేసింది ఎల్లోమీడియా ఛానళ్లే అని తేలడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు స్వయంగా లోకేష్ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నేతలు బాబు పర్యటన మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. అయితే టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాబు టూర్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించారని తెలుస్తోంది. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో షూట్ చేయడం చట్టరీత్యా నేరం. కాగా లోకేష్ తో పాటు మరికొందరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా ద్రోన్లతో అసెంబ్లీ, సచివాలయం లాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ద్రోన్లను ఎగరేసి చిత్రీకరించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వైసిపి నేత లేళ్ళ అప్పిరెడ్డి పోలీసులకు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు లోకేష్, ఇతర టీడీపీ నేతలపై కేసు నమోదు కానుంది. మరి ఈ కేసుపై చంద్రబాబు, లోకేష్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.
