అమరావతిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌ను టీడీపీ వక్రీకరించింది. అమరావతిపై మీడియాతో మాట్లాడుతూ..అక్కడ ఏముంది స్మశానం తప్పా…అంటూ బొత్స కామెంట్ చేశారు. అయితే అక్కడ ఏమి డెవలప్‌మెంట్ జరగలేదనే ఉద్దేశంతో స్మశానం అన్నానే తప్పా…వేరే ఏమి లేదని.. దయచేసి ఆ పదాన్ని వక్రీకరించవద్దని అదే మీడియా సమావేశంలో బొత్స వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం ఆంధ్రుల రాజధాని అమరావతిని స్మశానం అంటారా అంటూ బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రాజకీయం చేసింది. నవంబర్ 26 న అమరావతిపై బొత్స వ్యాఖ్యలను నిరసిస్తూ..టీడీపీ నేతలు యర్రబాలెం గాంధీ బొమ్మ సెంటర్‌లో ఓ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యలమంచిలి పద్మ అనే ఓ టీడీపీ సానుభూతిపరురాలు..చెప్పరాని పదజాలంతో మంత్రులు బొత్స, కొడాలి నాని, సీఎం జగన్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోను లోకేష్ టీమ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అయితే మంత్రులు బొత్స, కొడాలి నాని, సీఎం జగన్‌ను అసభ్యంగా దూషించిన ఈ వీడియోపై పోలీసులకు వైసీపీ కార్యకర్తలు కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు టీడీపీ కార్యకర్త పద్మపై సీఆర్‌పీసీ 41 కింద నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ కంచికచర్ల పోలీసులు పద్మను అదుపులోకి తీసుకున్నారు. కాగా పద్మ అరెస్ట్ అయిన కాసేపటికే.. వైసీపీ వాళ్లకేనా భావస్వేచ్ఛ..పద్మకు అండగా నిలబడదాం అంటూ టీడీపీ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ వెలసింది. దీన్ని బట్టి..లోకేష్ టీమే..పద్మతో మంత్రులను, సీఎం జగన్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని గతంలో శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్టుతో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను, సీఎం జగన్‌కు కులం పేరుతో దూషిస్తూ వీడియోలు పబ్లిష్ చేసిన లోకేష్ టీమ్..ఇప్పుడు మంత్రులు నాని, బొత్సలను పద్మ అనే మహిళా కార్యకర్తతో అసభ్య పదజాలంతో తిట్టించి అడ్డంగా దొరికిపోయింది. మరి పద్మపై కేసును టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
