ఏపీ శాసనసభకు తమను హాజరవ్వనివ్వకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించగా, మార్షల్స్ పై టిడిపి సభ్యులు దాడి చేశారని వైసిపి సభ్యులు ప్రత్యారోపణ చేశారు. దీనిపై ఇరు పక్షాల మద్య వివాదం శాసనసభలో శుక్రవారం కూడా కొనసాగింది. టిడిపి సభ్యులు డ్రామా ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తానుడ్రామాలు ఆడడం లేదంటూ వ్యక్తిగత దూషణకు దిగారు. దానికి బదులుగా మంత్రి కొడాలి నాని అబ్యంతరం చెబుతూ ప్రజలందరికి ఆ విషయం తెలుసునని అన్నారు. చంద్రబాబు నాయుడు కావాలని కార్యకర్తలను వెంట వేసుకువచ్చి మార్షల్స్ పై దాడి చేశారని అన్నారు. ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు లాక్కొన్నారని, జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన సంగతి తెలిసే ప్రజలు ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చి సీఎం ను చేసారని ఆయన అన్నారు. టిడిపి సభ్యులు క్షమాపణ చెప్పి సభా గౌరవాన్ని పాటించాలని వైసిపి డిమాండ్ చేసింది.
