జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను రహస్యం కలిసివచ్చిన తర్వాత ప్రభుత్వంపై పదేపదే మతపరమైన విమర్శలతో చెలరేగిపోతున్నాడు. కులం, మతం తనకు లేవంటూనే పదేపదే సీఎం జగన్‌పై కులం, మతం పేరుతో టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ మత రాజకీయాలను విబేధిస్తూ..రాజు రవితేజ వంటి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయినా పవన్ కల్యాణ్ మత రాజకీయాన్నే నమ్ముకుని సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. అయితే పవన్ మతపరమైన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పెట్టారు. ‘కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించడం మాత్రమే పరమత సహనం అనిపించుకోదు. ఇతర మతస్థులు కూడా హిందు మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుంది’ అంటూ పోస్ట్ చేశారు. అలాగే మరో పోస్ట్‌లో ‘నిజానికి నేనొక నాస్తికుడిని. కానీ నేను హిందు మతాన్ని విపరీతంగా గౌరవిస్తాను. కారణం హిందు మతంలో నాస్తికుల అభిప్రాయాలకి కూడా చాలా గౌరవం ఉంది. అందుకే చార్వాకం. నిరీశ్వరవాదం కూడా ప్రసిద్ధి చెందాయి. వేరే మతాలలో అయితే ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళకి చావే తలరాత అయ్యుండేది’ అంటూ ట్వీట్ చేశారు. అయితే నాగబాబు ట్వీట్లకు ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.. ‘పిచ్చి ముదిరింది… వీడి తలకి రోకలి చుట్టండ్రా!’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు ‘మెల్లగా హిందూ కార్డ్ వాడకం మొదలు పెడుతున్నారు అంటే.. భాజపా చేరువకి టీజర్ అనుకోవచ్చా?’ అంటూ ఓ నెట్‌జన్ చేసిన కామెంట్‌కు కత్తి మహేష్ పోస్ట్ పై స్పందిస్తూ… ‘మీకు ఇంకా సందేహమా.. వీళ్లవి అన్నీ అబద్దాలు, మోసాలే’ అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తంగా మెగా బ్రదర్స్ మత రాజకీయాలను క్రిటిక్ కత్తి మహేష్ చీల్చి చెండాడు..నాగబాబుపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు మెగాఫ్యాన్స్ మండిపడుతుండగా మరికొందరు మాత్రం కరెక్ట్‌గా చెప్పారంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి మెగా బద్రర్స్ , కత్తి మహేష్‌ల వివాదం మరెంత దూరం వెళుతుందో చూడాలి.
