ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను టీడీపీ మాత్రమే విమర్శిస్తుంది. ఈ విషయంపై టీడీపీ కేవల అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తే, రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో టీడీపీ పట్ల ప్రజల వ్యతిరేకత ఏర్పడుతుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలను సైతం నోరెత్తనీయకుండా చాలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకొని దెబ్బ కొట్టారు సీఎం జగన్ . ఇప్పుడు విపక్ష పార్టీలు కానీ.. సొంత పార్టీల నేతలు కానీ ఈ నిర్ణయంపై నోరెత్తే అవకాశం లేదు. జగన్ నిర్ణయం వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలకు రాజకీయంగా దెబ్బ తగిలే అవకాశం ఏవరైనా సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన వ్యతిరేకిస్తే ఆ ప్రాంతానికి వారు వ్యతిరేకమనే వాదనను తెరపైకి తెస్తారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ఆయనకు భారీ మైలేజ్ తీసుకువస్తుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.
