కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వాహక రాజదాని ఏర్పాటు ఆలోచనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట.మూడు సీజన్లలో అమరావతికి వచ్చి, సభ నడిపి ఆ తరవాత తాళాలు వేసేయాలనేది జగన్ ఆలోచనలా ఉంది అంటూ విమర్శించారు. అయితే ఈ వాఖ్యలపై కర్నూల్ విద్యార్థి సంఘాలు, సామన్య ప్రజలు మండి పడుతున్నారు. ఏం పవన్ కల్యాణ్ గారు రాయలసీమ ప్రజలు బాగు పడడం మీకు నచ్చదు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అంతేకాదు పవన్ దిష్ఠీ బొమ్మలు దగ్ధం చేశారు.
