మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రానికి మార్పు తేవాలని అన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం” అని అన్నారు.
