ఏపీలో తొలిసారిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున ఏపీ రాజధాని విషయంలో కూడా అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకటి కాదు మూడు రాజధానులు అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ఏపీకి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధాని ప్రాంతాలంటూ తెలిపారు. సౌతాఫ్రికా మోడల్ తరహాలో 3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఏపీ సీఎంగా జగన్ చేసిన కార్యక్రమాల పట్ల ఇతర రాష్ట్రాలు, కేంద్రం సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలే మహిళలపై జరుగుతున్న దారుణాల పట్ల దిశా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్‌ని తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని అటు కేంద్రం సైతం కొనియాడింది. ఇకపోతే ఇప్పటికే… ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించిన జగన్ సర్కార్.. తాజాగా మూడు రాజధానులు అంటూ.. తీసుకున్న నిర్ణయంతో జగన్ మరో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా మూడు రాజధాని ప్రాంతాలు లేవు. రెండు రాజధానులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ.. మూడు మాత్రం ఎవరికి లేవు. తాజాగా ఈ విషయంలో కూడా జగన్ మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.
