భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కులపెద్దగా భావించే నాయుడు గారు ఇలా ఇన్‌డైరెక్ట్‌గా మూడు రాజధానులపై అనుకూలంగా స్పందించడంతో చంద్రబాబు, ఎల్లోమీడియా అధిపతులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరి బాబుగారు రాత్రికి రాత్రి ఏం మాయ చేశారో కానీ..తెల్లారేసరికి వెంకయ్యనాయుడుగారు కూడా మూడు రాజధానులపై యూటర్న్ తీసుకున్నారు. డిసెంబర్ 25 న ఆత్కూర్ స్వర్ణభాతర్ ట్రస్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై ప్లేట్ ఫిరాయించారు. రాజధాని రైతులు తనను కలిశారని.. వారి ఆవేదనను చూసి భావోద్వేగానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. సీఎం, పాలనా, యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్కచోటే ఉండాలి అన్నారు. అన్నీ ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. నాయుడు గారి యూటర్న్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో రైతులను చూసి భావోద్వేగానికి గురయ్యానని అంటున్న వెంకయ్యానాయుడిగారికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వలసలు వెళ్తున్న కూలీలపై భావోద్వేగం కలగలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. ఒంగోలు ఫ్లొరైడ్ బాధితుల గురించి వెంకయ్య ఎందుకు స్పందించలేదు…? వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ఇస్తామన్న ప్యాకేజీ ఏమైంది?. కేంద్ర నుంచి వెంకయ్యనాయుడు ఎందుకు ఇప్పించలేకపోయారు…? పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు రూ. 30వేల కోట్ల పునారావాస ప్యాకేజీ ఇంకా ఎందుకు మంజూరు కాలేదు. ఆ ప్రాంత రైతులది త్యాగం కాదా?. కేవలం అమరావతి ప్రాంత రైతులదే త్యాగమా అని తోపుదుర్తి వెంకయ్య నాయుడి గారిని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీని నిలబెట్టె స్ఘంభాల్లో కనిపించే మూడు పసుపు సింహాలు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ అయితే కనిపించని ఆ నాలుగో పసుపు సింహమే వెంకయ్య నాయుడు గారని తోపుదుర్తి చమత్కరించారు. కాగా నాయుడుగారిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యంగవ్యాఖ‌్యలు చూసిన నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చమత్కరించడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్ద తోపు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా భారత ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో ఉండి..రాజధాని వ్యవహారంలో తలదూర్చి కులాభిమానంతో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడి వెంకయ్య నాయుడుగారు తన పరువు పోగొట్టుకున్నారనే చెప్పాలి.