Home / ANDHRAPRADESH / ఏంటీ జేసీ.. కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా..ఓసినీ కామెడీ తగలెయ్యా..!

ఏంటీ జేసీ.. కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా..ఓసినీ కామెడీ తగలెయ్యా..!

టీడీపీ వివాదాస్పద నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది…నేను మాజీ ఎంపీని, సీనియర్ నాయకుడిని..అలాంటిది బెయిల్ ఇవ్వకుండా కావాలనే నన్ను 7 గంటలు స్టేషన్‌‌లో ఉంచుతారా..వెంటనే కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని జగన్ సర్కార్‌ను బర్తరఫ్ చేయాలంటూ వితండవాదం చేస్తున్నారు జేసీ సారూ..ఇంతకీ జరిగిందేదంటే..ఇటీవల బాబుగారు అనంతపురం పర్యటించారులెండీ…ఇంకేముంది జేసీ గారు కల్లుతాగిన కోతిలా చెలరేగిపోయారు. పోలీసులు జగన్ ప్రభుత్వానికి తొత్తుల్లా చేస్తున్నారు..మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే..మాకు అనుకూలమైన పోలీసులును నియమించుకుంటాం..పోలీసుల చేత మా బూట్లు నాకిస్తాం..ఏమనుకుంటున్నారో…మాకు ఎదురుతిరిగిన పోలీసులపై గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తామంటూ పోలీసులపై చిందులు వేశారు. ఇంతకీ జేసీ బ్రదర్స్ బాధ ఏంటంటే..ఇదివరకులా అనంతపురంలో జేసీ బ్రదర్స్ గూండాయిజం, వసూళ్లదందాలు నడవడం లేదు.. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ఆ ఫ్రస్టేషన్‌లో జేసీ బూట్లు నాకిస్తా అంటూ పోలీసులపై నోరు పారేసుకుంటున్నారు. జేసీ వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ చేసిన ఫిర్యాదుపై అనంతపురం రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో జేసీ నెల నెలా నాలుగుసార్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి వెళ్లమని కోర్టు ఆదేశించింది.

 

ఈ మేరకు నిన్న బెయిల్ కోసం అనంతపురం స్టేషన్‌కు వెళ్లిన జేసీని పోలీసులు బెయిల్ ప్రాసెస్‌ విషయంలో కాసేపు వెయిట్ చేయించారు. దీంతో జేసీ ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పోలీసులను తిట్టిపోశాడు. నాకు కేసులు కొత్తేమి కాదు..ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ చిందులేశారు. ‘నేను దేశద్రోహిని కాదు. ముందస్తు బెయిల్‌పై స్టేషన్‌కు వెళితే.. వెంటనే బెయిల్‌ పత్రాలు పరిశీలించి అర్ధగంటలో పంపేయవచ్చు. కానీ 7 గంటల పాటు నిర్బంధించడం ఏమిటి?’ అంటూ మండిపడ్డారు.. నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. భోజనం చేయాలని చెప్పినా వదలలేదు.. ఈ పోలీసులు రిమోట్‌ కంట్రోల్‌లా పనిచేస్తున్నారు’ అంటూ జేసీ పోలీసులపై విరుచుకుపడ్డారు. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన తనను స్టేషన్‌లో నిర్బంధించి ఇబ్బందిపెట్టామని చెప్పుకోవడానికి మాత్రమే బెయిల్‌ మంజూరుపై కాలయాపన చేశారని ఎద్దేవాచేశారు. తనను 7 గంటల పాటు నిర్భంధించినందుకుగాను తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జగన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని జేసీ వింత డిమాండ్ చేశారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తానని, అవసరమైతే ప్రాణాలు సైతం అడ్డుగా పెడతానంటూ జేసీ డైలాగులు వేశాడు… మొత్తంగా రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. పోలీసులను బూట్లు నాకిస్తా అంటూ..అడ్డగోలుగా మాట్లాడి..కేసులో ఇరుక్కుని…ఇప్పుడు నన్ను 7 గంటలు స్టేషన్‌లో ఉంచారు.. జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేయాలి అని జేసీ కామెడీగా మాట్లాడుతున్నారు. ఓసినీ కామెడీ తగలెయ్యా…జేసీ.. తమరు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్..ఇలా అడ్డగోలుగా మాట్లాడి ఉన్న పరువు ఎందుకు తీసుకుంటారు సామి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat