Home / ANDHRAPRADESH / నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!

నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!

ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 వ తేదీ మంగళవారం నాడు శాసనమండలికి చేరనున్నాయి.

 

కాగా మండలిలో అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీకే బలమెక్కువ. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ బిల్లులను అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. అమరావతిలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు నిరసనగా అమరావతిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న లోకేష్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మా టీడీపీ ఎమ్మెల్సీలంతా ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని…జై అమరావతి నినాదానికి కట్టుబడి ఉన్నామని…బిల్లులను అడ్డుకోవడానికి మాదగ్గర వ్యూహం ఉంది..నా తడాఖా ఏంటో రేపు మీరే చూస్తారంటూ నిప్పులు చెరిగారు. పసిబిడ్డ లాంటి రాజధానిని పొడిచి చంపేసి.. తల వైజాగ్ లో, కాళ్లూ చేతులు కర్నూలులో, శవాన్ని అమరావతిలో పెడతామంటే బిడ్డ బతుకుతుందా? అని లోకేష్ ప్రశ్నించారు.

 

అయితే తడాఖా చూయిస్తానంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. తమరి తడాఖా ఏంటో తెలుసు కాబట్టే..నెల రోజులుగా మీ బాబు నిన్ను పక్కన పెట్టి..మీ అమ్మను, మీ భార్యను తీసుకుని అమరావతి గ్రామాల్లో తిరుగుతున్నారు….నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు..నీ తడాఖా ఎందుకు చూయించలేదంటూ ప్రశ్నిస్తున్నారు..మీ కులపోళ్లు ఎక్కువగా ఉన్న రాజధానిలో నువ్వు ఓడిపోయినప్పుడే నీ తడాఖా ఏందో అర్థమైంది లోకేషూ… అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. మీ నాయన, నువ్వూ జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతున్నా…మూడు రాజధానుల ప్రకటనను అడ్డుకోలేకపోయారు…రాంగోపాల్ వర్మ భాషలో చెప్పాలంటే పప్పులాంటి అబ్బాయి అసెంబ్లీ పులిలా గర్జిస్తుంటే..నిజంగానే చూడాలని ఉందంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌‌లో సెటైర్లు వేస్తున్నారు. అయినా నువ్వు తడాఖా చూపించినా..తొడ కోసుకున్నా చేసేందేలేదూ… మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవడం నీ వల్ల కాదు లోకేషూ..అంటూ నెట్‌జన్లు పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat