గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని.. ఆయన అధికారంలోకి రాగానే సీమలో వర్షాలు కురిశాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. రైతులకు ఆయన అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
