జగన్‌కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు ..మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు ఎక్కడా లేవు. అందరూ జగన్ తీరు చూసి నవ్వు కుంటున్నారు పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు జగన్ కు పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. సీఎంకు దమ్ముంటే మందడం రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. పోలీసులు ఉంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి సీఎం జగన్‌దని ఎద్దేవా చేశారు. జగన్ ఎంత త్వరగా అధికారంలోకి వచ్చారో అంతే త్వరగా తెరమరుగవుతారని జోస్యం చెప్పారు. అయితే ఈ వాఖ్యలు వైసీపీ నేతలు కౌంటరు ఇస్తున్నారు. ఏపీకి ఎవరు న్యాయం చేస్తారో తెలుసుకోని నిన్ను.. నీ పార్టీ ని భూస్థాపితం చేశారు ఆంద్ర ప్రజలు బాబు…ఇక నీ మోసపు మాటలు వినే వారు ఎవరు లేరు ఇక్కడ..రాయలసీమ ద్రోహి అంటూ అక్కడ ఉద్యమం మొదలైయ్యింది..ఉత్తరాంధ్ర ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతారు..ఇక నిన్ననే రాజధాని రైతులు జగన్ కలసి చర్చలు జరిపారు వారికి నీవు చేసిన మోసం తెలిపారు…ఇక నీ పని అయిపోయింది బాబు అంటూ గట్టిగా కౌంటర్ వేస్తున్నారు.
