టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా హరిత ఉద్యమంలా సాగుతోంది. పలువురు రాజకీయనాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్లు, సామాజిక సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి..ఒక్కొక్కరు మరో ముగ్గురికి మొక్కలు నాటమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా స్వీకరించారు. నగరి పట్టణంలో ఎమ్మెల్యే రోజా మహా ర్యాలీ నిర్వహించి పీసీఎన్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా హీరో అర్జున్, మంత్రి అనిల్ కుమార్, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిలకు ఛాలెంజ్ విసిరారు. తాజాగా ఎమ్మెల్యే రోజా సవాలును స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కురుపాం నియోజకవర్గం చినమేరంగిలో తన భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ విషయాన్ని తెలుపుతూ పుష్పశ్రీవాణి స్వయంగా ట్వీట్ చేశారు. #GreenIndiaChallenge లో భాగంగా నగరి శాసనసభ్యులు రోజాగారు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి నేడు కురుపాం నియోజకవర్గం చినమేరంగిలో మొక్క నాటడం జరిగింది. మొక్కలే మానవాళికి జీవనాధారం. ప్రతి ఇంటికీ ఒక మొక్క నాటుదాం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను, తనకు గ్రీన్‌ఛాలెంజ్ చేసిన ఎమ్మెల్యే రోజాను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అభినందించారు. మొత్తంగా గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు మరింతగా ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయం.
మొక్కలే మానవాళికి జీవనాధారం. ప్రతి ఇంటికీ ఒక మొక్క నాటుదాం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం. #GreenIndiaChallenge లో భాగంగా నగరి శాసనసభ్యులు రోజాగారు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి నేడు కురుపాం నియోజకవర్గం చినమేరంగిలో మొక్క నాటడం జరిగింది. pic.twitter.com/30myLPiQsG
— Pamula Pushpa Sreevani – MLA (@PushpaSreevani) February 1, 2020