ముఖ్యమంత్రి వైయస్.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై సీఎంను, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసిచింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వరల్డ్ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్‌బర్న్ బెంజ్ ఇతర అధికారులు ఉన్నారు.
