శుక్రవారం అనగా (28–02–2020) నాడు ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వెళ్లనున్నారు. 9.30 గంటలకు తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరి 10.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 11–12.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే జగన్ పోలవరం టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం అయ్యాక జగన్ పోలవరాన్ని విస్మరించారని టీడీపీ విమర్శించింది. అనంతరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. అయనా పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. ఈనేపధ్యంలో సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి అనిల్ తో కలిసి ప్రాజెక్టును వేగంవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పోలవరం పనుల్లో వేగం పుంజుకుంటుందని, జగన్ పని మొదలు పెట్టారంటూ వెంటనే పూర్తవుతుందని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
