ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.