కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఒక పారాసెటిమల్ మాత్ర చాలని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని బీజేపీ మహిళా నేత సాదినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారాసెటిమల్ మాత్ర వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశముందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ అభిమానులు పోషల్ మీడియాలో సాదినేని యామినిపై కౌంటర్ ఇస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ నియంత్రణ కొరకు బ్లీచింగ్ పౌడర్ ని వాడుతున్నారు కావాలంటే వీడియో లు , ఫోటోలు షేర్ చేసి మరి చూపిస్తున్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకునే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లుకుని పరిశుభ్రత పాటిస్తే కరోనా మన దరికి చేరదని ఏపీ సిఏం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
