ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “నా బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నాను. నాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, నాతో కలిసి అల్లరి చేస్తూ, కొంటె పనుల్లో భాగస్వామిగా ఉంటూ, నాతో కలిసి పెద్ద పెద్ద పనులు చేసే నా రియల్ లైఫ్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరితో నిస్వార్థంగా మెలిగే నా బిడ్డను నా జీవితం కన్నా మిన్నగా ఇష్టపడతాను. లవ్యూ దేవాన్ష్” అంటూ ట్వీట్ చేశారు.
Happy Birthday to my best friend who pillow-fights me, my partner in crime who travels with me on adventures galore, my real life hero who cares for everyone unconditionally and my son whom I love more than life itself! Love you Devaansh! pic.twitter.com/ZCczcXijTh
— Lokesh Nara (@naralokesh) March 21, 2020