ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని
వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి చెందిన నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఈక్రమంలో జగన్ ఇన్నాళ్ళు పవన్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఏకంగా ఆయన వ్యక్తిగత విషయాలను సైతం టచ్ చేస్తూ విమర్శలు ఎందుకు చేశారు. అసలు అలా అనాల్సినవసరం ఏముంది అని ఆరా తీస్తే జగన్ కానీ వైసీపీ శ్రేణులు కానీ ఏదో ఉన్నఫలంగా అన్నవి కావు.
జగన్ చేసిన వ్యాఖ్యలను పరీశీలిస్తే గత నాలుగేండ్లుగా బాబుతో కలిసి ఉన్నాళ్ళు పవన్ పై ఈగ కూడా వాలనీవ్వకుండా వెనకెసుకోని వచ్చిన బాబు ఆస్థాన మీడియా ఎప్పుడైతే పవన్ టీడీపీ నుండి బయటకు వచ్చాడో అప్పటి నుండి పవన్ జగన్
కలిసిపోయారు.. రానున్న ఎన్నికల్లో జనసేన వైసీపీ కల్సి బరిలోకి దిగుతాయి.
రాష్ట్రాభివృద్ధిని జనసేన,వైసీపీ కల్సి కుమ్మక్కై అడ్డుకుంటున్నారు అని ఇటు ఆస్థాన మీడియా,అటు తెలుగు తమ్ముళ్ళు గత కొన్నాళ్ళుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికోట్టడానికి..జనసేనతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికే.బాబు ఆస్థాన మీడియా నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే జగన్ పక్క ప్లాన్ ప్రకారం ఇలా వ్యాఖ్యానించడం జరిగిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు..