తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మడంలో కొంతమంది సొంత పార్టీ నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మురళీ మోహన్ యొక్క వివాదస్పద వ్యాఖ్యల వీడియోను ఓ టీడీపీ నేతనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి ఆధారాలను ఆ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంపారు.
ఎంపీలు మాట్లాడుకుంటున్న సమయంలో వారికి తెలియకుండానే సెల్‌ఫోన్‌లో షూట్ చేసి.. వెంటనే సోషల్ మీడియాలో పెట్టేశారు. నిజానికి ఏపీ భవన్‌లో ఆ సమయంలో టీడీపీ నేతలే ఉన్నారు. ఇంకెవరూ లేరు. మీడియా ప్రతినిధులు అసలే లేరు. ఎంపీలు మాట్లాడుకున్నది ఏపీ భవన్‌లో. అక్కడ ఎంపీలు కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. మీడియా వారు అసలే లేరు. కానీ, వారి దృశ్యాలు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయన్నది టీడీపీ నేతలకు తెలియకుండా ఉండదు.
అయితే, టీడీపీలో ఓ స్థాయిలో ఉన్న నేతలే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీకి ద్రోహం చేసే నేతలను ఎలా కనిపెట్టాలో అన్న పనిలో పడ్డారు చంద్రబాబు. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సొంత పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు.