వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 50 రోజులపాటు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 412 కి.మీ. పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ 15 సభల్లో ప్రసంగించారు.
నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట దగ్గర నుంచి విశాఖ జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. తమ సమస్యలను వైఎస్ జగన్‌కు చెప్పుకోవడానికి విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ అడుగులో అడుగులు వేసి రాజన్న రాజ్యం తెస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు విశాఖ ప్రజలు.
ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ విశాఖపట్నం జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు .. విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులతోపాటు భారీ సంఖ్యలో ప్రజలు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు బారులు తీరారు.