ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (84శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో స్టేట్ ర్యాంకు, వేద ప్రణవ్ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్‌లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు
