అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ నరసరావుపేటలోని ఆయన ఇంటి ముందు ఇవాళ కొంత మంది ఆందోళన చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన రూ.7లక్షలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని వారు నినాదాలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో శివరామ్‌కు డబ్బులు ఇచ్చామని.. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగివ్వలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా తమ డబ్బును ఇచ్చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేవారు. శివరామ్‌ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బాధితులు.
