జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు వద్ద దీర్ఘకాలంగా పీఏగా పనిచేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లు అక్రమాస్తులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేనాని స్పందిస్తూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. అయితే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పుకునే పీకే కనీసం ఐటీ దాడుల్లో దొరికిన అక్రమాస్తిపై మాట్లాడకపోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. మరోవైపు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ని మాత్రం పవన్ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
