ఎంతచాటు మాటు యవ్వారాలైనా.. సరే.. ఏదో ఒక సందర్భంలో బయట్టబయలు అవక తప్పదు. అందుకు పాలిటిక్స్ మినహాంపేమీ కాదు. పలువురు రాజకీయ నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారి గత అనుభవాలు చెప్పే సందర్భంలో ఎన్నో రహస్యాలు బయటపడిన సందర్భాలు కోకొల్లలు. అయితే, ఇటువంటి బాగోతమే మళ్లీ బయటపడింది.
ఇక అసలు విషయానికొస్తే.. సినీ నటుడు పవన్ కళ్యాణ్ అవినీతిపై ప్రశ్నిస్తానంటూ వచ్చి 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తన సత్తా ఏమిటో తెలుసుకునేందుకు ఎన్నికల్లో పాటిస్పేట్ చేస్తాడు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అవినీతిపై ప్రశ్నిస్తానంటూ వచ్చి.. ఎన్నో అవినీతి ఆరోపణలున్న చంద్రబాబుకు తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అవినీతి ఆరోపణలు ఉన్న చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడంపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.
see also : ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ?
అంతే కాకుందా, చంద్రబాబు పవన్ కల్యాన్‌కు ప్యాకేజీ ఏమన్నా ఆఫర్ చేశాడా..? ఆఫర్ చేస్తే ఎన్ని కోట్లు ఆఫర్ చేసి ఉంటాడో…? ఇద్దరూ కలిసి ఎలా ఎన్నికల ప్రచారానికి వెళతారో..? అన్న ప్రశ్నలు రాజకీయ నాయకులతోపాటు.. విశ్లేషకులను వెంటాడాయి. మొన్నటి వరకు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం అంతుచిక్కలేదు. కానీ, ఇటీవల తిరుపతి ఎంపీ శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న అసలు విషయాన్ని రట్టు చేశారు.
see also : ద్యావుడా..! అబ్బాయినీ వదల్లేదుగా..!!
అయితే, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వివిధ అవతరాల్లో పార్లమెంట్ లోపల కాకుండా.. పార్లమెంటు వెలుపల హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీరు ఇలా వేషయాలు వేయకుండా పార్లమెంట్‌లో పోరాటం చేయొచ్చు కదా..? సార్ అన్న విలేకరి ప్రశ్నకు సమాధానం చెప్తూ.. నేనేం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లాగా ప్యాకేజీ తీసుకుని వేషాలు వేయడం లేదుకదా..? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏదేమైనా ఇప్పటి వరకు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న పవన్ కల్యాణ్ ప్యాకేజీ యవ్వారాన్ని తిరుపతి ఎంపీ శివప్రసాద్ ఒక్కసారిగా బయటపెట్టడంతో రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే రేపింది ఈ న్యూస్.