ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 94వ రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వదలడం లేదని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు ఇలా వారి వారి సమస్యలను వైఎస్ జగన్ తో చెప్పుకుంటున్నారు.
see also : జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
see also : కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఇదిలా ఉండగా.. మంగళవారం ప్రకాశం జిల్లా తిమ్మపాళెం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 93వ రోజు ముగిసిన విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజలతో మాట్లాడుతూ.. నేను ఒక్కటే చెప్తున్నా..!, గర్వంగా చెప్తున్నా..!! మా నాయన మేనత్తలు అందరూ ఎస్సీలనే పెళ్లి చేసుకున్నారు. నేను ఈ రోజు మామ అని పిలిచే వాళ్లందరూ ఎస్సీలే. అందుకు నేను గర్వపడుతున్నా. సీఎం చంద్రబాబులా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు..? మంత్రి ఆదినారాయణరెడ్డి మాదిరి ఎస్సీలు స్నానం చేయరు అలాంటి వ్యాఖ్యలు దారుణమని, అలాంటి వ్యాఖ్యలు చేయడం నా వ్యక్తిగతానికి చాలా దూరమని చెప్పారు వైఎస్ జగన్.
see also : కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి