ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను ఊరపందితో పోల్చారు. జగన్‌వి ఊరపంది ఆలోచనలని, జగన్ దగుల్బాజి ఆలోచనవల్ల ప్రధాని మోడీకి నోటీసులు వచ్చాయని, బీజేపీ వైఎస్ జగన్‌ను దగ్గరకు రానివ్వదని ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు.
see also : జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!!
see also : రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?
ఇన్ని కేసులు ఉన్న వ్యక్తులు బయటపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. తమను విమర్శించే శక్తిని వైఎస్ జగన్ ఎప్పుడో కోల్పోయారని, అధికారులనే ప్రలోభపెట్టే వైఎస్ జగన్ ఐఏఎస్‌ల కొంప ముంచారన్నాని దుయ్యబట్టారు. మంత్రిగా నేను సచివాలయానికి వస్తే.. జగన్, విజయ సాయిరెడ్డి చేతులు కట్టుకుని కోర్టుకు వెళ్తున్నారన్నారు. జమ్మలమడుగు అభివృద్ధికి తాను, రామసుబ్బారెడ్డి ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా సీఎం అంగీకరిస్తారన్నారు. తన మాటలను వక్రీకరించి విజయసాయిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఆదినారాయణరెడ్డి.