దివంగత ముఖ్యమంత్రిఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు, ఎన్టీఆర్ రాజకీయంగా ఆపదలో ఉన్నప్పుడు నేనే ఆదుకున్నా, ఆగస్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించలేకపోయారు, నా రాజకీయ అనుభవంతో ఎన్టీఆర్‌ను ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడేలా చేశా, తనకు ప్రధాని పదవి ఇస్తానన్నా నేను వద్దంటా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!!
see also : రూ.100 కోట్ల విలువైన మట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్లన్న అవినీతి బాగోతం..!!
see also : సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
టీడీపీ ఆగస్టు సంక్షోభంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నన్ను పిలిచి.. ఆ సంక్షోభం నుంచి నన్ను (ఎన్టీఆర్) బయటపడేలా చెయ్ అంటూ అనడంతోనే నేను(చంద్రబాబు) ఆగస్టు సంక్షోబం నుంచి ఎన్టీఆర్‌ను ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడేలా చేశానన్నారు. అప్పుడు అలా చేయడంతోనే నా రాజకీయ చాణుక్యతను చూసిన ఎన్టీఆర్ నన్ను టీడీపీలోకి ఆహ్వానించారని చెప్పారు. అదే సమయంలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు చాలా బాధపడ్డానని, ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలోనూ అదే స్థాయిలో బాధ కలిగిందని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.