వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటు మోడీ ప్రభుత్వంపై, ఇటు చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. మోడీ, చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబూ..మీకు చేతకాకపోతే చెప్పండి.. ప్రత్యేక హోదా మేం తెస్తామంటూ సంచలన ప్రకటన చేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
see also : పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
ఇదే సందర్భంలో వైఎస్ జగన్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గోవెల్స్ సిద్ధాంతాలను గట్టిగా పాటిస్తున్నారన్నారు. జర్మనీ దేశంలో గతంలో హిట్లర్ పరిపాలన కొనసాగిందని, అదే సందర్భంలో గోబెల్ అనే వ్యక్తి హిట్లర్ ప్రభుత్వంలో ఐఎన్‌బీ మినిస్టర్‌గా పనిచేశారన్నారు. అయితే, ఆ గోబెల్ అనే వ్యక్తి పని ఏందయ్యా..? అంటే.. అబద్ధాన్ని నిజమని నమ్మించడమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో చేస్తున్నది అదే. అబద్ధాన్ని నిజమని నమ్మించడమే. చంద్రబాబు తన అనుకూల మీడియాను డెవెలప్ చేసుకుని, ఆ అనుకూల మీడియా లో చంద్రబాబు అబద్ధపు పాలనను నిజమని నమ్మిస్తూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు వైఎస్ జగన్.
see also : బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!