ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, అందులో భాగంగానే, ఇటీవల పలు ఎన్నికల సర్వే సంస్థలు చేసిన.. సర్వేల్లో 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపడుతారంటూ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ సర్వే ఫలితాలకు అద్దంపడుతూ.. జగన్ ఏ సభ పెట్టినా.. ప్రజలు అశేషంగా పాల్గొనడం గమనార్హం.
see also : టీడీపీ నేతలకు చంద్రబాబు స్ర్టాంగ్ వార్నింగ్..!!
ఇదిలా ఉండగా, ఆదివారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తాడంకిలో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను 148వ రోజు కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి బసవతారకం బంధువు కాట్రగడ్డ సుబ్బారావు వైఎస్ జగన్‌ను కలిశారు. మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని, మీరే కాపాడాలంటూ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే, కాట్రగడ్డ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మేనల్లుడు అనీల్ కుమార్‌కు రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చిన్న తగాదా తలెత్తిందని, ఆ క్రమంలో తన కుమారుడితోపాటు భార్య, ఇద్దరు పిల్లలను పామర్తి అనీల్ కుమార్ కిడ్నాప్ చేయించారని జగన్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని ఎలాగైనా మీరే రక్షించాలంటూ జగన్‌ను వేడుకున్నారు. వారి సమస్యను విన్న జగన్.. వెంటనే సమస్యపై దృష్టిసారించి పరిష్కరిస్తానని తెలిపారు.