ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేసవి కాలాన్ని మించిన వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్రత్యేక హోదాపై పోరాటం క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామనడం అధికార పార్టీకి తగదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక హోదాపై మాట మార్చి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అంతేకాక, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా.. కోడలు మగ బిడ్డను కంటానంటే.. అత్త వద్దంటాదా..? అంటూ మీడియాను సైతం సీఎం చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు ఆళ్ళగడ్డ టీడీపీ టిక్కెట్టు ..ఉందా ..లేదా..నమ్మలేని నిజాలు..!
అయితే, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా విషయంలో ఒకే మాటపై ఉంటూ, తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో సైతం ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారుర ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అలా ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న పోరాటంలో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సైతం ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఇలా వైసీపీ పార్టీ అధి నేత నుంచి కార్యకర్తల వరకు ప్రత్యేక హోదాపై వారి స్థాయిలో పోరాడుతూనే ఉన్నారు.
వైఎస్ జగన్ కు ఘన స్వాగతం..కట్టుబొట్టులో అభిమానం
రాజీనామాలను ఆమోదించే క్రమంలో పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలను పిలిపించి.. మీరు చేసిన రాజీనామాలకు అర్థం ఉంది.. ప్రత్యేక హోదా విషయంలో మనస్థాపంతోనే రాజీనామాలు చేసినట్టు అర్థమవుతుంది.. మరో జారీ రాజీనామాలపై ఆలోచించుకోండి అంటూ సుమిత్రా మహాజన్ సూచించారు. అయితే, తాము మాత్రం ప్రత్యేక హోదా విషయంలో రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీలు తెగేసి చెప్పారు. దీంతో సుమిత్రా మహాజన్ ఈ నెల 6న మళ్లీ రావాలని వైసీపీ ఎంపీలకు సూచించారు.