ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్న వ్యాఖ్యలకు సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీలోని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ పార్టీల అధినేతలు ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
see also:టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ ..!
ఇదిలా ఉండగా, మంత్రి నారా లోకేష్ ఇటీవల టీడీపీ సభలో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మోడీ, జగన్ కుమ్మక్కయ్యారంటూ మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన పోసాని కృష్ణ మురళీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎవరు..? ఏపీ టీడీపీకి చెందిన నేతలను కేంద్రంలో మంత్రులను చేసింది ఎవరు..? నోటుకు ఓటు కేసులో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కాళ్లపై సాగిలపడింది ఎవరు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, పోసాని సంధించిన ప్రశ్నలన్నిటికి టీడీపీ అనే అర్థం వస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా నాలుగేళ్లపాటు సంసారం చేసి.. ఇప్పుడు వైసీపీకి అక్రమ సంబంధం అంటగట్టడం ఎంత వరకు సమంజసం అంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు పోసాని సూపర్బ్ కౌంటర్ ఇచ్చాడు.