వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 187వ రోజుకు చేరుకుంది. ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా వైఎస్ జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ) జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
see also:కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటి సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. టీడీపీ నేతలకు సైతం దిమ్మ తిరిగేలా ప్రజలు జగన్‌కు మద్దతు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అనేలా అనేలా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు జగన్‌కు మద్దతు తెలిపారు.
see also:టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ ..!
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా అంతే స్థాయిలో మద్దతు లభిస్తుందేమోనన్న భయంతో.. జగన్ పాదయాత్రపై టీడీపీ కుట్రలను ప్రారంభించింది.అందులో భాగంగానే రాజమండ్రి వంతెనపై పాదయాత్ర చేయొద్దు అని, కృష్ణా జిల్లా పాదయాత్రలో భాగంగా కృష్ణా బ్రిడ్జీ సైతం కదిలిందని, అదే సీన్ రాజమండ్రి వంతెనపై కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న కట్రలకు వైసీపీ ధీటైన సమాధానం ఇచ్చింది. న్యాయపరమైన అనుమతులు తీసుకుంది. దీంతో రాజమండ్రి బ్రిడ్జీపై జగన్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే, టీడీపీ నేతలు చెప్పినట్టు రాజమండ్రి బ్రిడ్జీపై పాదయాత్ర చేస్తే ప్రమాదమేమీ ఉండదని ఇంజినీర్లు చెప్పడం కొసమెరుపు.
see also;మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు పోసాని సూపర్బ్ కౌంటర్..!