Home / ANDHRAPRADESH / ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో  బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు కేసుల భయంతో పరారీ అయ్యారు. కే ట్యాక్స్‌ల పేరుతో సత్తెనపల్లి, నరసరావులపేటలలో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ కోట్లు గడించిన మాజీ స్పీకర్ టీడీపీ నేత కోడెల, ఆయన కొడుకు, కూతురు పలు కేసుల్లో కూరుకుపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ దొంగతనంపై, కేట్యాక్స్ వసూళ్లపై, పలు భూకబ్జాలపై. గడ్డి స్కామ్ పై, కేబుల్ టీవీ స్కామ్‌పై..ఇలా పలు నేరాల్లో కోడెల కుటుంబ సభ్యులపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో జైలుకు పోతామనే భయంతో కోడెల కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ పరారీ కాగా, కోడెల గుండె నొప్పి అంటూ హాస్పిటల్లో చేరాడు. తాజాగా 5 కే ట్యాక్స్ కేసుల్లో విచారణ జరిపిన ఏపీ హైకోర్ట్ కోడెల, ఆయన కొడుకును సెప్టెంబర్ 6 వ తేదీలోగా కోర్టుకు సరెండర్ కావాలని, వారంలో మూడు రోజుల్లో కోర్టుకు హాజరు కావాలని, విచారణలో పోలీసులకు సహకరించాలని తీర్పు చెప్పింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న కోడెల ఫ్యామిలీ పోలీసులకు లొంగిపోక తప్పడంలేదు.

ఇక గ్రామ వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు పాటించడం లేదంటూ అధికారులపై భౌతిక దాడులకు పాల్పడిన ఆముదాలవలస టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు నమోదు అయింది. దీంతో జైలుకు పోతాననే భయంతో కూన రవికుమార్ పరారీ అయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కూన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు… ఇక అక్రమమైనింగ్ కేసులో ఇరుక్కున్న గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు ఆదేశింవచ్చని ఏపీ హైకోర్ట్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఈ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. తాజాగా ఈ కేసులో జరిగిన విచారణలో యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్ష్యం చెప్పారు. దీంతో జైలు భయంతో యరపతినేని కూడా పరారీ అయ్యాడు. అజ్ఞాతంలో ఉంటూ..ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి యరపతినేని ప్రయత్నిస్తున్నాడు.

 అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దందాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని..ఒక  మహిళ అని కూడా జుట్టుపట్టుకుని లాగి, ఈడ్చికొట్టిన దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కున్నాడు. ఒక ఘరానా దొంగలాగా అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి చింతమనేని పరారీ అవడం గమనార్హం. ఇక గత ఐదేళ్లు లక్ష కోట్లు, ఏ1 అంటూ మైకుల ముందు రంకెలు వేసే నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిపై కూడా ఓ ఫోర్జరీ కేసు నమోదు అయింది. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించినట్లు ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డితో పాటూ మరో ముగ్గుర్ని ఈ కేసులో నిందితులుగా చేర్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు. దీంతోసోమిరెడ్డి బయటకు రావడం లేదు…ఈ కేసులో లాయర్లతో చర్చించి..న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా గత ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అండ చూసుకుని అవినీతి, అరాచకాలకు పాల్పడిన టీడీపీ నేతలు కేసుల భయంతో పరారీ అవడం చూసి ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే..నిస్సహాయంగా చూస్తూ ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు తాము పెంచి పోషించిన నేతలంతా ఇలా వరుసగా పరారీ అవుతుండడం చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు.